బిచ్కుంద మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మేడే ఉత్సవాలకు రావాలని స్థానిక ఎమ్మెల్యేను ఆహ్వానించినప్పటికీ.. అతను రాలేదని ఆగ్రహించారు కార్మికులు. ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు.
భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో మేడే ఉత్సవాల్లో భాగంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే హనుమంత్ షిండేను ఆహ్వానించారు.నియోజకవర్గంలో మంత్రి పర్యటన ఉండటంతో ఆయన కార్యక్రమానికి రాలేదు.
అయితే.. ఎమ్మెల్యే వస్తున్నాడని స్వాగతం పలుకుతూ భవన నిర్మాణ కార్మికులు టీఆర్ఎస్ నాయకుల ఫొటోలతో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పిలిచినా ఎమ్మెల్యే రాకపోవడం అవమానంగా భావించిన భవన నిర్మాణ కార్మికులు ఫ్లెక్సీలను చించివేశారు.
Advertisements
చివరకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తారాను పిలిచి కార్యక్రమం నిర్వహించారు.