నటి సంజనా గల్రానీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు.సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్, వీడియోస్ ను పోస్ట్ చేసింది. ఆ ఫొటోల్లో తన బేబీ బంప్ ను చూపించింది. అంతే కాకుండా నా ప్రినేటల్ యోగా ఇన్‌స్ట్రక్టర్ #tannybhattacharjee అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.
ఇక పిల్లల గురించి పోస్ట్ చేస్తూ … నేను పిల్లలను నిజంగా ప్రేమిస్తున్నాను, నేను నా మూడవ త్రైమాసికంలో అడుగుపెడుతున్నాను. మరింత ప్రశాంతతను పెంపొందించడానికి నేను వేచి ఉండలేను. ఆశాజనకంగా ఉండండి సంతోషంగా ఉండండి అంటూ చెప్పుకొచ్చింది.
సినిమాల విషయానికి వస్తే సంజనా బుజ్జిగాడు,సర్దార్ గబ్బర్ సింగ్‌తో సహా పలు తెలుగు చిత్రాలలో నటించింది. ఇక మే 2020లో కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ అజీజ్ పాషాతో రహస్యంగా వివాహం చేసుకుంది.
కరోనా మహమ్మారి కారణంగా వివాహాన్ని చాలా సింపుల్‌గా చేసుకుంది. కన్నడ చిత్ర పరిశ్రమలో పెళ్లి కోసం ఆదా చేసిన డబ్బును సాంకేతిక నిపుణులకు సహాయం చేయడానికి ఆమె విరాళంగా ఇచ్చింది.