కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లన్నీ మూతపడడంతో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్, సుధీర్ బాబు నాని హీరోగా నటించినటువంటి వి సినిమాకూడా ఓటీటీ లో విడుదలైంది. కాగా ఇప్పటికే మరికొన్ని సినిమాలు కూడా ఓటీటీ పడుతున్నాయి.
అయితే తాజాగా రాజ్ తరుణ్ హీరోగా నటించిన…ఒరేయ్ బుజ్జిగా చిత్రాన్ని ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు అందించాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉదయం సోషల్‌మీడియా వేదికగా రాజ్ తరుణ్ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. నిరీక్షణ దాదాపు పూర్తయ్యినట్లే. ఎందుకంటే 100శాతం వినోదాత్మకమైన ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రాన్ని ఆహా వేదికగా మీ ముందుకు తీసుకురానున్నాం. అక్టోబర్ 2 విడుదల చేస్తున్నాం. ఫన్ మిస్ కాకండి అంటూ ట్వీట్ చేశాడు.