ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో బుల్డోజర్ హవా నడుస్తోంది. యూపీ ఎన్నికల సమయంలో యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్‌కు ప్రాచుర్యం తీసుకొచ్చారు. ఇటీవల ఓ అత్యాచార నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు కూడా బుల్డోజర్‌ను ఉపయోగించారు. అయితే, ఇప్పుడు ఈ బుల్డోజర్ ట్రెండ్ పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లోకి పాకింది. మధ్యప్రదేశ్‌లో కూడా ఓ రేపిస్టు అక్రమాలకు బుల్డోజర్‌తో బుద్ధిచెప్పారు అధికారులు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో సుభాష్ నగర్ బహోడాపుర్ ఏరియాకు చెందిన చతుర్భుజ్ రాథోడ్ అనే 65 ఏళ్ల వృద్ధుడు.. చాక్‌లెట్లు ఆశ చూపి 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై ఆ చిన్నారి పేరెంట్స్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే నిందితుడు ఎలాంటి అనుమతులు లేకుండా కట్టిన ఇంట్లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు.
దీంతో జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. ఆ ఇంట్లో వారిని ఖాళీ చేయించి దానిని బుల్డోజర్‌తో కూలగొట్టారు. ఆ ఇల్లు అక్రమంగా కట్టడంతోనే కూల్చేశామని అధికారులు తెలిపారు. ఈ ఘటనను సీఎం శివరాజ్ సింగ్ ట్వీట్టర్ ద్వారా షేర్ చేశారు. అలాగే, నేరస్థులకు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. అక్రమాలు, గుండాగిరీలు చేస్తే సహించేది లేదని, మారిపోతారా? రాష్ట్రం వదిలి పారిపోతారా? లేదంటే బుల్డోజర్ రావాలా? అంటూ ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు.
ग्वालियर शहर के सुभाष नगर बहोड़ापुर रोड निवासी 65 वर्षीय चतुर्भुज ने एक 11 वर्षीय मासूम बालिका के साथ दुष्कृत्य का जघन्य अपराध कर मानव समाज को कलंकित किया था।@CMMadhyaPradesh#JansamparkMP pic.twitter.com/nR3n2WcJeS
— Collector Gwalior (@dmgwalior) March 30, 2022
సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించిన యాంటీ మాఫియా క్యాంపెయిన్‌లో భాగంగా రేప్ కేసు నిందితుడు అక్రమంగా కట్టిన ఇంటిని బుల్డోజర్‌తో కూల్చేశామని గ్వాలియర్ జిల్లా కలెక్టర్ ట్వీట్ చేశారు. ఇంటిని కూల్చివేస్తున్న వీడియోను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అమానవీయమైన రేప్ ఘటనను సమాజాన్ని కలచివేసిందని కలెక్టర్ అన్నారు.
దీనిని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రీట్వీట్ చేశారు. “మధ్యప్రదేశ్ గడ్డపై గూండాలు, దుర్మార్గులు, మాఫియాలకు చోటు లేదు. ఒకటి రాష్ట్రం విడిచి వెళ్లిపోండి లేదా ఇక్కడే ఉండాలంటే మంచిగా మారండి. మరో మార్గం లేదు. అలా కాదంటే బుల్డోజర్ దూసుకొచ్చేస్తది” అంటూ శివరాజ్ సింగ్ ట్వీట్ చేశారు.
मध्यप्रदेश की धरती पर गुंडे, बदमाशों और माफियाओं के लिए कोई जगह नहीं है।
प्रदेश छोड़ दो या सुधर जाओ, कोई और रास्ता नहीं है। नहीं सुधरे तो बुलडोजर चलेगा। https://t.co/jUnj5re2Ht
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) March 30, 2022
Advertisements