వెన్ను నొప్పి కోసం ఆసుపత్రిలో చేరింది ఓ అమ్మాయి. ఈ మధ్య కాలంలో వయస్సుతో నిమిత్తం లేకుండా వస్తున్న ఇబ్బందే కావటంతో… నిమ్స్ ఆసుపత్రి వైద్యులు రకరకాల టెస్ట్‌లు చేశారు. మందులు కూడా ఇచ్చారు. అయినా తగ్గలేదు.. దీంతో స్కానింగ్ తీయగా సంచటన విషయం బయటపడింది. వెన్నులో ఎదో ఇనుప ముక్క ఉన్నట్లుగా వైద్యులు గుర్తించి… ఆపరేషన్ చేయాలని సూచించారు.
దాదాపు రెండు నెలల చికిత్స అనంతరం ఆపరేషన్ చేయగా… వెన్నులో నుండి ఓ బుల్లెట్ లభ్యం అయింది. బుల్లెట్ చూసి ఆశ్చర్యపోయిన డాక్టర్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 19 సంవత్సరాల అస్మా బేగం అనే అమ్మాయి నిమ్స్‌లో వెన్ను నొప్పి అని చికిత్స తీసుకుంటుంది. ఓల్డ్ సిటీ ఫలక్‌నుమాకు చెందిన ఆమె పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అయితే, డాక్టర్లు చికిత్స పూర్తి చేసి… పోలీసులకు బుల్లెట్ గురించి సమాచారం అందించారు. కానీ పోలీసులు వచ్చే సరికే ఆ అమ్మాయి ఆసుపత్రి నుండి వెళ్లిపోవటం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది.