కోవిడ్ 19 మహమ్మారి అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఏడాదిన్నర పాటు విజృంభించిన ఈ మహమ్మారి ముఖ్యంగా ఆరోగ్య, ఉద్యోగ రంగాలను దెబ్బ తీసింది. కరోనా కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. మరికొంత వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. వర్క్ ఎలా చేస్తున్నా కొంతమందికి మాత్రం సగం జీతాలు మాత్రమే పడుతున్నాయి. ఇంత చెడు చేసిన కరోనా మహమ్మారి కొంచెం మంచి కూడా చేసింది. ప్రస్తుత పరిస్థితిని విశ్లేషించిన తర్వాత ఐటి ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది.
జాబ్ మార్కెట్ పరిశీలిస్తే ఐటీ నిపుణుల డిమాండ్ 400 శాతం పెరిగిందని నిర్ధారణ అయింది. ఓ సర్వే ప్రకారం ఇపుడు ఐటి రంగం ఉద్యోగులకు భారీగా ఇంక్రిమెంట్లు ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి సిద్ధం అవుతోందని సమాచారం. వాస్తవానికి 2020 జూన్ లో ఐటీ నియామకం 50 శాతం పడిపోయింది. అయితే ఇప్పుడు గత సంవత్సరంతో పోలిస్తే అత్యధిక శాలరీ తో పాటు మంచి ప్యాకేజీ నన్నుకూడా అందించడానికి ఐటీ రంగం రెడీ అంటోంది.
ఇంజనీర్ల కోసం కంపెనీలు ఇప్పుడు 70 నుంచి 120 శాతం జీతాన్ని పెంచుతున్నాయి. టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ మహిళా ఉద్యోగుల కోసం అతిపెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి ఇతర పెద్ద టెక్ దిగ్గజాలు ఈ ఏడాది ఇండియా మొత్తంలో ఉద్యోగులను వేగంగా నియమించుకుంటున్నాయి. దీనర్థం ఐటీ రంగానికి సంబంధించిన మొత్తం వేతన బిల్లులు 1.6 నుంచి 1.5 బిలియన్ డాలర్లు పెరిగిపోతోంది. ఐటీ రంగంలోఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు.