కృతి శెట్టి.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరు. ప్రస్తుతం తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ టీనేజ్ బ్యూటి. ఏ ముహూర్తాన హీరోయిన్ గా అడుగుపెట్టిందో గానీ.. తెలుగు, తమిళ్‌లో వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతోంది. తాజాగా కృతికి మరో కోలీవుడ్ స్టార్ హీరో సరసన ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది. దాంతో కృతి అక్కడ సీనియర్ హీరోయిన్లకు చెక్ పెట్టేసిందని అంటున్నారు.
ఉప్పెన సినిమాతో ఆకట్టకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది. దాంతో ప్రస్తుతం ఈ బ్యూటీకి స్టార్ హీరోయిన్లు సైతం ఈర్ష్యపడేలా భారీ ఛాన్స్‌లు వస్తున్నాయి.
ఇప్పటికే తెలుగులో సుధీర్ బాబు సరసన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.. నితిన్ జంటగా ‘మాచర్ల నియోజికవర్గం’.. రామ్ పోతినేని జోడిగా ‘ది వారియర్’ అనే సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలను ఆమె హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఇక తమిళ్‌లో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ చిన్నది. విలక్షణ దర్శకుడు బాలా-స్టార్ హీరో సూర్య కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాతో.. కృతిశెట్టి కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది.
అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ చేయబోతున్న ఓ సినిమాలో కృతి ఛాన్స్ దక్కించుకుందట. అయితే.. ఈ సినిమాలో ముందుగా ప్రియాంకా అరుళ్ మోహన్ ను అనుకున్నారట. కానీ.. తాజాగా ఈ బ్యూటీ తప్పుకోవడంతో.. ఆ ఛాన్స్ కృతిశెట్టికి వరించినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. దాంతో కృతి సీనియర్ హీరోయిన్లకు చెక్ పెట్టడమే కాదు.. అటు తమిళ్.. ఇటు తెలుగులోను మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయిందని చెప్పుకుంటున్నారు.