సదా మీ ప్రేమకు బానిస అంటూ హృదయకాలేయం సినిమాతో గిలిగింతలు పెట్టే పేరడీ చేసి తన కామెడీతో అందరి కళ్ళల్లో పడ్డాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అలియాస్ సంపూ. ఇలాంటి ఒక హీరో కూడా టాలీవుడ్ లో ఉన్నాడు అని ప్రూవ్ చేసేశాడు. ఆ తర్వాత ఒకటీ, అరా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించినా పెద్దగా క్లిక్ కాలేదు సంపూ. కానీ రీసెంట్ గా మరో పేరడీ మార్క్ కామెడీ సినిమా “కొబ్బరి మట్ట” తో మరోసారి అందరికీ తనదైన హాస్యం పంచి, మరోసారి వెలుగులోకి వచ్చాడు.
హీరోగా కనిపించడమే కాకుండా కొబ్బరిమట్టలో పాపారాయుడు. పెదరాయుడు, ఆండ్రాయుడు గా త్రిపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నాడు. ఈ సినిమా కోసం మూడున్నర నిమిషాల పొడవైన డైలాగ్ చెప్పి రికార్డ్లు బద్దలుకొట్టి మరీ రికార్డులకెక్కి అందరినీ ఆశ్చర్యపరిచాడు సంపూ. ఎలాంటి అంచనాలు లేఖుండా ఒక చిన్న సినిమాగా విడుదలయి అనూహ్యంగా భారీ వస్సూళ్ళను సాధించి బడా నిర్మాతలకు సైతం షాక్ ఇచ్చింది కొబ్బరిమట్ట. కింగ్ నాగార్జున, రకుల్ వంటి పెద్ద నటుల కాంబోగా వచ్చిన “మన్మథుడు 2” సినిమాతో పాటుగా విడుదలయి కలెక్షన్స్ విషయంలో నాగ్ పై సైతం కొబ్బరిమట్ట ముందంజ వేయడంతో ఉన్నట్టుండీ అగ్ర నిర్మాతల కన్ను సంపూర్ణేష్ బాబు పైన పడిందట.
తనతో చిన్న బడ్జెట్ సినిమా చేస్తే లాభాలు ఆర్జించవచ్చనేది వారి స్ట్రాటజీ. ఇదే క్రమంలో ఇప్పుడూ టాలీవుడ్ అగ్రదర్శకుడు క్రిష్ కన్ను కూడా సంపూపై పడినట్టుగా వార్తలొస్తున్నాయి. తను చివరగా బాలకృష్ణ హీరోగా తెరకెక్కించిన ఎన్.టీ.ఆర్ బయోపిక్ రెండు భాగాలూ తీవ్రంగా నిరాశపరచడంతో, ఈ చిన్న హీరోతో అంచనాల్లేకుండా సినిమా చేసి హిట్టు కొట్టి మళ్లీ ట్రాక్ ఎక్కెయ్యచ్చని ఆలోచిస్తున్నట్టుగా ఒక సమాచారం. అలాగే రానున్న రోజుల్లో అగ్ర నిర్మాతల బేనర్లలో, అగ్ర దర్శకుల నుండి మరిన్ని సినిమాలు సంపూర్నేష్ బాబు హీరొఘా అనౌన్స్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.