ఇస్మార్ట్ శంకర్ మూవీలో మాస్ లాంగ్వేజ్‌తో మాట్లాడి యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ నభా నటేశ్. ఆ మూవీ తర్వాత ఈ చిన్నదానికి చెప్పుకోదగ్గ అవకాశాలే వస్తున్నాయి. అమ్మడు కూడా నో చెప్పకుండా.. వచ్చిన చాన్స్‌ను వచ్చినట్టుగా వాడేసుకుంటోంది. అయితే తాజాగా ఈ బ్యూటీకి.. బాలీవుడ్‌లో ఓ బంపర్ ఆఫర్ తగిలినట్టుగా తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్‌హీరో హృతిక్ రోషన్‌తో నభా నటేష్‌కు స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కినట్టుగా తెలుస్తోంది. హాలీవుడ్‌లో మోస్ట్ ఫేమస్ స్పై థ్రిల్లర్ – ది నైట్ మేనేజర్ టీవీ సిరీస్‌ని త్వరలో బాలీవుడ్‌లో రీమేక్ చేయాలని చూస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా నభానటేశ్‌ను అడిగినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి బీటౌన్ మీడియా కథనాలు కూడా రాస్తోంది. దీంతో కచ్చితంగా ఈ వార్త నిజమనే అనుకుంటున్నారు. మొత్తానికి తొందరలోనే బీటౌన్ చెక్కయబోతోందని చెప్పుకుంటున్నారు.