నర్సాపురం రాజుగారికి మళ్లీ భలే ఛాన్సు తగిలింది. పార్లమెంటరీ పార్టీ సమావేశానికి.. ఆయనకు ఆహ్వానం ఇవ్వలేదు. ఇస్తే వెళ్లాలా వద్దా అని ఆయన ఆలోచనలో పడేవారు. కాని జగన్ మెంటాలిటీ తెలిసినవారు కదా.. అందుకే పిలవరని ముందే అంచనా వేసుకున్నారు. అలాగే పిలవలేదు. అప్పటికీ పొరపాటున ఆయనకు కూడా ఆహ్వానం పంపి.. మళ్లీ రావద్దని చెప్పారని తెలిసింది. ఇదంతా జగన్, విజయసాయిరెడ్డిల ఆదేశాలతోనే అని కూడా సమాచారం. ఇంకేముంద రాజుగారు మళ్లీ మీడియా ముందుకొచ్చేశారు.. వాటీజ్ దిస్ అన్యాయం అంటూ ప్రశ్నించేశారు.
రఘురాముడి విషయంలో వైసీపీ మరోసారి వ్యూహాత్మక తప్పిదం చేసిందని కొందరంటున్నారు. ఆయనను పిలిస్తే.. వచ్చేవాడు కాదని.. అప్పుడు.. ఇరుకున పెట్టగలిగేవారమని కొందరు వాదిస్తున్నారు. అయితే ఆల్రెడీ అనర్హత వేటు వేయమని లోక్ సభ స్పీకర్ కు లెటరిచ్చి.. మళ్లీ పిలిస్తే కూడా ఇరుకునపడతామని చెబుతున్నారు. అంటే బాస్ ని పిలిచినా ప్రాబ్లమే.. పిలవకపోయినా ప్రాబ్లమే.. ఏం చేసినా.. రాజుగారికి మరో అవకాశమే. అలా తయారు చేసి పెట్టారు మరి సిట్యుయేషన్ ని.. రాజుగారు.
అసలు పార్లమెంటరీ కమిటీ సమావేశం.. సమావేశాలు మొదలయ్యాక వేయడమే పెద్ద ఫార్సు. మామూలుగా అయితే ఒకరోజు, రెండు రోజుల ముందే వేసుకుంటారు. దానికి తగ్గట్టే బీఏసీలో ఆ పార్టీ ప్రతినిధులు మాట్లాడతారు. కాని ఇక్కడ అలాంటివేమీ జరగలేదు. కాకపోతే ఎజెండా అంతా జగన్, విజయసాయిరెడ్డి.. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ల ముగ్గురే మాట్లాడుకుంటారు.. వీరేం చెబితే అదే మిగతావాళ్లూ పాలో కావాలి. అయితే రఘురామకృష్ణంరాజు నేరుగా డిమాండ్ చేశారు.. జగన్ గారూ సమావేశం పెట్టాలి.. అని అడిగారు. బహుశా ఈయన అడిగాకే గుర్తొచ్చినట్లుంది.. సమావేశం పెట్టారు.. కాని ఈయన్ని మాత్రం పిలవలేదు.
ఇప్పుడు రాజుగారు సభలో ఏం మాట్లాడతారనేదానిపై వైసీపీలో టెన్షన్ కొనసాగుతుంది. ఆయన ఎలాగూ సమయం దక్కించుకుంటారు.. పైగా ముందే నోటీసులు.. వగైరా.. అన్నీ పక్కా పద్ధతి ప్రకారం చేయడానికి కావాల్సిన యంత్రాంగం ఆయన దగ్గర ఇప్పటికే ఏర్పాటు అయింది. కాబట్టి.. టీడీపీ కన్నా ఎఫెక్టివ్ గా.. రఘురామకృష్ణంరాజు ఈ సెషన్స్ లో వైసీపీని ఇరుకుపెట్టనున్నారనే అంచనాలు ఉన్నాయి.
ఇప్పుడు ఎటూ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి పిలవలేదు కాబట్టి.. వారి ఎజెండాకు భిన్నంగా ఈయన వెళ్లినా.. రేపు ప్రశ్నించలేని పరిస్ధితిని వైసీపీయే తెచ్చుకుంది. నన్ను సమావేశానికి పిలవకపోతే.. నేను పార్టీ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడానని ఎలా ఆరోపిస్తారు.. ఎలా ప్రశ్నిస్తారు అంటూ ఎదురు దబాయించడం ఖాయం. రేపు అదే జరుగుతుంది. మనం చూస్తాం.