ఇంటికో ఉద్యోగం ఇవ్వకపాయే-నిరుద్యోగ భృతి ఏమాయే నినాదంతో ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తున్నట్లు తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా నల్ల కండువాతో 29వరోజు పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. నేడు ముస్తాబాద్ ఐకేపీ సెంటర్ నుంచి గన్నెవానిపల్లి, సేవాలాల్ తండా, అంకిరెడ్డి పల్లె మీదుగా సారంపల్లి వరకు యాత్ర కొనసాగనుంది.
ఇవాళ్టి పాదయాత్రలో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల, మాజీ ఎంపీ విజయశాంతి సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొననున్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు నిరసనగా నల్ల కండువాలతో ముందుకు కదలనున్నారు. సాయంత్రం అంకిరెడ్డిపల్లెలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు బండి సంజయ్, పురుషోత్తం రూపాల, విజయశాంతి.