టాలీవుడ్‌లో స్టైలిష్ హీరో అంటే మొదట గుర్తొచ్చే పేరు అల్లు అర్జున్ . తన డ్రెస్సింగ్‌తో పాటు మూవీస్‌లో తన డ్యాన్స్ మూమెంట్స్‌తో ట్రెండ్ సెట్ చేశాడు. 2001లో మామయ్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘డాడీ’ సినిమాలో డ్యాన్సర్‌గా చిన్న పాత్రలో మెరిసిన బన్నీ.. 2003 వచ్చిన ‘గంగ్రోత్రి’ సినిమాతో హీరోగా మారాడు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ హిట్‌గా నిలిచింది. అయితే.. అల్లు అర్జున్‌పై రకరకాల విమర్శలు వచ్చాయి. వాటన్నింటికీ తర్వాత వచ్చిర ‘ఆర్య’ సినిమాతో సమాధానం తెలిపాడు.
సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అల్లు అర్జున్‌కి నంది స్పెషల్ జ్యూరీ అవార్డును తెచ్చి పెట్టడంతోపాటు.. స్టైలిష్ స్టార్ అనే బిరుదును తీసుకొచ్చి పెట్టింది. వరుస హిట్లతో తన రేంజ్‌తో పాటు మాస్ ఫాలోయింగ్‌ని పెంచుకుంటూ వెళ్లాడు. అంతేకాకుండా ఏ తెలుగు హీరోకి లేనట్లు కేరళలో అల్లు అర్జున్‌ని ప్రత్యేకంగా అభిమానులు ఏర్పడ్డారు. అక్కడి ఫ్యాన్స్ ఆయన్ని మల్లు అర్జున్ అని పిలుచుకుంటూ ఉంటారు.
ఇక.. 2021లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ సినిమా బన్నీని పాన్ ఇండియా స్టార్‌ని చేసేసింది. ఆ తర్వాత నుంచి ఆ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో.. తర్వాత రాబోయే సీక్వెల్ ‘పుష్ప: ది రూల్’ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ చిత్రం ఎప్పుడూ విడుదలైన రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని బన్నీ అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. కాగా.. ఆయన మొదటి సినిమా ‘గంగ్రోత్రి’ విడుదలై నేటికి 20 ఏళ్లు గడిచిపోయాయి.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన ట్విట్టర్ లో ”ఈరోజు నేను సినీ పరిశ్రమకు వచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. ఇక్కడ ఇలా ఉన్నానంటే దానికి కారణం కేవలం మీరు, మీ అభిమానం, మీ ప్రేమ మాత్రమే కారణం”అంటూ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపాడు.
కాగా సోమవారం రామ్ చరణ్ బర్త్ డే కాగా బన్నీ విషెస్ మాత్రం సోషల్ మీడియాలో కనిపించలేదు. దీంతో మెగా అభిమానులు నీకు ఈరోజు ట్విట్ పెట్టడానికి ఖాళీ ఉంది కానీ చరణ్ కి బర్త్ డే విషెస్ చెప్పడానికి మాత్రం ఖాళీ లేదంటూ మండిపడుతున్నారు. సోమవారం రాత్రి మెగాస్టార్ ఇంట్లో జరిగిన చరణ్ బర్త్ డే వేడుకల్లోనూ బన్నీ కనిపించకపోవడంతో మరోసారి అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య ఉన్న విభేధాలు మరోసారి తెర మీదకు వచ్చాయి.