పుష్ప చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రేత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ నటించారు. అయితే ఈ సినిమా సక్సెస్ దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ కు వెంటనే పార్ట్ 2 పై దృష్టి పెట్టేలా చేసింది.
కాగా ఇటీవల అల్లు అర్జున్, సుకుమార్ ఇతర ప్రధాన సాంకేతిక నిపుణులను మీట్ అయ్యారట. పుష్ప పార్టు 1 విజయం పై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ డిసెంబర్ నాటికి పార్టు2 ను రిలీజ్ చేసేందుకు అవసరమైన ప్లానింగ్ గురించి చర్చించారట.
అయితే మార్చి రెండవ వారం నుండి కేవలం నాలుగు నెలల్లో మొత్తం షూటింగ్ కంప్లీట్ చేయగలరా అని అల్లు అర్జున్ సుకుమార్‌ను అడిగారట.సుకుమార్ కూడా రెడీ అన్నట్లు చెప్పారట. మరి చూడాలి ఏం జరుగుతుందో.
ఇక మరోవైపు పుష్ప పార్టు 2 కోసం ఫోటో షూట్ కు ఓ స్టార్ నటుడు రెడీ అవుతున్నాడట. మరి ఆ స్టార్ నటుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.