స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ అదరగొట్టిన సంగతి తెలిసిందే. సంక్రాంతి సమయంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. వసూళ్ల పరంగా ఈ సినిమా ఊహించని రికార్డులతో బన్నీ కెరియర్లోనే చెప్పుకోదగినదిగా నిలిచింది. అయితే త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి మంచి విజయాలను సొంతం చేసుకున్న ‘అల వైకుంఠపురంలో’ సినిమా మాత్రం కొత్త రికార్డులను కైవసం చేసుకుంది. వీరిద్దరి కాంబినేషన్ కు సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గా పేరుంది. తాజా సినిమా కూడా హిట్ ను అందుకోవడంతో హ్యాట్రిక్ ను నమోదు చేశారు.
అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో మరో సినిమా చేయాలనీ బన్నీ ఫాదర్ మాటల మాంత్రికుడిని కోరాడట. అల సినిమాకు సీక్వెల్ గా కానీ, మరో మంచి కథతో కానీ ఇంకో చిత్రాన్ని తెరకెక్కించాలని అల్లు అరవింద్ కోరాడట. అందుకు త్రివిక్రమ్ కూడా ఒకే చూపినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. వీరిద్దరూ ప్రస్తుతం తమ, తమ సినిమాలో బిజీబిజీగా ఉన్నారు. కనుక త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ లో మరో సినిమా చేయడం ఇప్పట్లో కష్టమే అయినా రెండేళ్ల తరువాత రావొచ్చు.