ఇటీవల మెగాహీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే సినీ స్టార్స్ తేజ్ ను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్తున్నారు. కాగా గురువారం రాత్రి అపోలో హాస్పిటల్ కి వెళ్ళారు బన్నీ. తేజ్ ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కాగా సరిగ్గా వారం క్రిందట కేబుల్ బ్రిడ్జి పై స్పోర్ట్స్ బైక్ తో పడ్డారు తేజ్.
మొదట మెడికవర్ ఆసుపత్రికి తరలించగా… ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. తేజ్ కు షోల్డర్ బోన్ సర్జరీ చేసిన వైద్యులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.