తెలుగు రాష్ట్రాల్లో ఉష్టోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ముంచుకి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అత్యవసరం అయితే తప్ప ఉదయం 9 వరకు ఇంట్లోనే ఉంటున్నారు. తీవ్రమైన మంచుతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట దగ్గర పక్కన ఉన్నవారు కూడా కనిపించకుండా మంచు దుప్పటి కమ్మేసిన దృశ్యం కనిపించింది. విజయవాడ హైదరాబాద్ రోడ్డు పై పూర్తిగా మంచు కప్పేసింది.
జాతీయ రహదారి పై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లైట్లు వేసుకుని నడుపుతున్నా.. ఎదురుగా వస్తున్న వాహనాలను గుర్తించడం కష్టంగా మారింది. ఉదయం 8 గంటలు దాటినా.. సూర్యుడు కానరావటంలేదు. దారి కనిపించక వాహనాలను రోడ్డు ప్రక్కన నిలిపివేస్తున్నారు.