చిత్తూరు జిల్లా కెవి పల్లి మండలం మహల్ క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నకారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. రాయచోటి చెందిన షేక్ నసీబ్ ఖాన్ ,షేక్ మయూన్ రఫీ, షేక్ హారూన్ రషీద్ ,షేక్ ఖాదర్ ఉన్నిసా మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.