జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్ టైర్ పేలి అదుపుతప్పింది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందగా.. 40 మందికి పైగా గాయపడ్డారు.’
బస్ జగిత్యాల నుంచి నిర్మల్ వైపు వెళ్తోంది. మల్కాపూర్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా టైర్ పేలింది. బస్ అటూ ఇటూ తిరుగుతూ ఓ మురికి కాలువలోకి దూసుకెళ్లి ఆగింది. అయితే.. డ్రైవర్ అందులో పడి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. డ్రైవర్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతడు చనిపోయాడు.
బస్సును అదుపు చేసేందుకు డ్రైవర్ ఎంతో కష్టపడ్డాడని ప్రయాణికులు తెలిపారు. తమను రక్షించి అతను చనిపోవడంతో కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. డ్రైవర్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు ప్రయాణికులు.