మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని సిధి జిల్లాలో బస్సు ఘోర ప్రమాదానికి గురయ్యింది. ప్రమాద సమయంలో బస్సులో 54మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. బస్సు నీటి కాలువలోకి దూసుకెళ్లటంతో ఇప్పటికే 30మంది మరణించినట్లు తెలుస్తోంది. ఏడుగురు సురక్షితంగా భయటపడగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మొత్తం 47 మంది ప్రయాణికులు గల్లంతు అయ్యారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.