పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
జంగారెడ్డి గూడెం మండలంలోని జల్లేరు వాగు దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ బస్సు అశ్వారావుపేట నుండి జంగారెడ్డిగూడెం వెళ్తోంది. స్థానికులు గమనించి బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకు లాగుతున్నారు.