విజయవాడ సమీపంలోని తుమ్మల పాలెం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును తప్పించబోయి లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుకనే ఉన్న ఎంవీఆర్ కాలేజ్ బస్ లారీని ఢీకొట్టింది.
లారీని కాలేజ్ బస్ బలంగా ఢీకొట్టడంతో డ్రైవర్, అతని వెనుక ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్ లో సుమారు 40 మంది విద్యార్థులు ఉన్నారు.
విద్యార్థులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంతో కాసేపు ట్రాఫిక్ జాం అయింది. పోలీసులు స్పాట్ కు చేరుకుని లారీ, బస్ ను పక్కకు తొలగించారు.
లారీ వెనుక భాగం కాస్త దెబ్బతినగా.. బస్ డ్రైవర్ క్యాబిన్ మొత్తం నుజ్జునుజ్జయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థులకు పెద్దగా ప్రమాదం లేకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.