హైదరాబాద్ లో కొందరు ప్రయాణికులు తృటిలో పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నారు. కూకట్ పల్లి జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర కావేరి ట్రావెల్స్ బస్ కు మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా ఆ ఏరియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
మంటల్ని గమనించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. లేదంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. క్షణాల్లో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో బస్ మొత్తం పూర్తిగా కాలిపోయింది.
విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో జేఎన్టీయూ కూడలి దగ్గర కాసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మంటలు ఎలా అంటుకున్నాయన్న దానిపై విచారణ జరుగుతోంది.