ఆర్టీసీ సమ్మె కారణంగా… తాత్కాలిక డ్రైవర్లతో జనం ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ప్రభుత్వం పట్టింపులకు పోయి… శిక్షణలేని, అనుభవం లేని డ్రైవర్లకు బస్సులు అప్పగిస్తోంది. దాంతో ఆ డ్రైవర్ల డ్రైవింగ్ వల్ల, రద్దీ ప్రాంతాల్లో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
తాజాగా… జనగాం డిపో బస్సు భీభత్సం సృష్టించింది. తాత్కాలిక డ్రైవర్ బస్సును నడుపుతుండగా… బస్సు అదుపు తప్పి, ఎదురుగా ఉన్న వాహనాలను డీకొట్టింది. ఈ ఘటనలో పలు వాహనాలు ద్వంసం కాగా… తాత్కాలిక డ్రైవర్ బస్సును నడి రోడ్డుమదే వదిలేసి పరారయ్యాడు.
ఈలాంటి ఘటనలపై ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.