కర్నాటకలో ప్రైవేట్ బస్ బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మంది చనిపోయారు. 25 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. తుమకూరు జిల్లాలో వైఎన్ హోసకోటె నుంచి పావగడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
విషయం తెలిసిన వెంటనే పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. గాయపడ్డ వారిని పావగడలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు.
బస్ బోల్తా పడటానికి ఓవర్ లోడ్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది వరకు ఉన్నట్లు తెలిపారు. ఎక్కువ మంది ఉండడంతోనే బస్ బోల్తా పడిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు.
గాయపడిన 25 మందిలో దాదాపు 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని బతికించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు పోలీసులు.