ముంబై డ్రగ్ డీలర్ టోనీ అరెస్ట్ తర్వాత సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కోట్లకు పడగలెత్తిన బడాబాబులు మత్తులో జోగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్ కేసులో ఏడుగురు వ్యాపారవేత్తలు అరెస్ట్ అయినట్లు వివరించారు.
అరెస్ట్ అయిన వారు టోనీ ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్నట్లు దర్యాప్తులో తేలడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.
అరెస్ట్ అయిన వారి వివరాలు
బండి భార్గవ్- ప్రముఖ వ్యాపారి
చలసాని వెంకట్- ప్రముఖ ఎక్స్ పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వ్యాపారి
తమ్మినేని సాగర్- ప్రముఖ వ్యాపారి
ఆనంద్- పాత బస్తీ కేంద్రంగా మసాలా దినుసుల వ్యాపారం
నిరంజన్ కుమార్ జైన్- బ్రిడ్జీల కాంట్రాక్టర్
సూర్య సుమంత్ రెడ్డి- ప్రముఖ కాంట్రాక్టర్
శాశ్వత్ జైన్- ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి
డ్రగ్ డీలర్ టోనీని అరెస్ట్ చేయడంతో వీళ్ల బాగోతం అంతా బయటపడింది. నగరంలో డ్రగ్స్ తీసుకొన్న వారి చిట్టా తమ దగ్గర ఉందన్న సీపీ సీవీ ఆనంద్.. మరో నలుగురు వ్యాపారుల పేర్లను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకొంటే జైలుకు పంపుతామని హెచ్చరించారు.