ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ ఫీల్ గుడ్ రూరల్ డ్రామా‘బుట్ట బొమ్మ’. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అయితే ఇది వరకు సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే.
‘బుట్టబొమ్మ’ టైటిల్ రోల్లో అనిక సురేంద్రన్ నటిస్తోంది. సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ నెల 26న మూవీ జనం ముందుకు రాబోతున్న సందర్భంగా కథానాయిక అనిక సురేంద్రన్ మీడియాలో ముచ్చటించింది.
‘ బుట్టబొమ్మ’లో అవకాశం రావడం గురించి అనిక మాట్లాడుతూ, ”బాలనటిగా ఎన్నో ఏళ్లుగా పలు చిత్రాలలో నటించాను. ఇప్పుడిలా హీరోయిన్ గా నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది.
‘కప్పేలా’ మలయాళ వెర్షన్ చూశాను. చాలా నచ్చింది. ఇంతలోనే ఆ ఫిల్మ్ రీమేక్ లో హీరోయిన్ గా నటించే అవకాశం రావడం ఆనందం కలిగించింది. ఆ పాత్రలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి, నటనకు ఆస్కారం ఉంది.
అందుకే ఏ మాత్రం ఆలోచింకుండా వెంటనే అంగీకరించాను. పైగా దీనిని సితార ఎంటర్ టైన్ మెంట్స్ లాంటి సంస్థ నిర్మించడంతో మరో ఆలోచన ఏదీ చేయలేదు” అని తెలిపింది. మలయాళ మాతృక కంటే ‘బుట్టబొమ్మ’ బాగుంటుందని చెబుతూ, ”మూల కథ అలాగే ఉంటుంది.
కానీ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు. ఒరిజినల్ ఫిల్మ్ కంటే కూడా ఇది ఇంకా కలర్ ఫుల్ గా, ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక నేను మొదటిసారి హీరోయిన్ గా నటించడం వల్ల ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది.
పైగా నాది సినిమాలో ప్రధాన పాత్ర. అయితే దర్శకుడు రమేష్ గారు, మిగతా చిత్ర యూనిట్ సపోర్ట్ తో ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా సినిమాని పూర్తి చేయగలిగాను. నిజానికి తెలుగులో నాకు సంభాషణలకు అర్థం తెలీదు.