బుట్టబొమ్మ రిలీజ్ లేటు అవుతోంది. 26న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా ప్రకటన చేసింది.
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ రూరల్ డ్రామాలో అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నాకు. ఇన్నాళ్లూ బాలనటిగా మెప్పించిన అనిఖాకు హీరోయిన్ గా ఇదే తొలి సినిమా. ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నాడు.
ఇప్పటికే నటుడు అర్జున్ దాస్ ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పాడు. హీరోయిన్ అనిఖా సురేంద్రన్ సైతం ఈ సినిమా కలర్ ఫుల్ గా, అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని చెబుతోంది. ఇంతకీ ఈ సినిమాను ఎందుకు వాయిదా వేశారో తెలుసా?
సితార ఎంటర్టైన్మెంట్స్ గతేడాది ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ‘డీజే టిల్లు’ చిత్రాన్ని నిర్మించింది. 2022 ఫిబ్రవరిలో విడుదలైన డీజే టిల్లు చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయాన్ని అందుకుంది. అందుకే సెంటిమెంట్ గా ‘బుట్టబొమ్మ’ ను కూడా ఫిబ్రవరికి వాయిదా వేశారంట.