సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి అనికా సురేంద్రన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “బుట్ట బొమ్మ”. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విశ్వక్ సేన్ ఆవిష్కరించాడు.
అరకు నేపథ్యంలో సాగే కథ ఇది. సత్య అనే మొండి అమ్మాయి సూర్య అనే ఆటోడ్రైవర్‌తో ప్రేమలో పడింది. అతని వల్ల హీరోయిన్ పూర్తి స్వేచ్ఛ పొందుతుంది. కానీ అర్జున్ దాస్ పోషించిన రెబల్ పాత్రతో వారి ప్రేమ కథ మొత్తం మారిపోతుంది.
ఫస్ట్ హాఫ్‌లో అందమైన ప్రేమకథ, సెకండాఫ్‌లో సస్పెన్స్ మిక్స్ చేసి ఈ సినిమా తీసిన విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది.ట్రైలర్ లో అనికా సురేంద్రన్, సూర్య, అర్జున్ దాస్ నటన ఆకట్టుకుంది. దర్శకుడు శౌరి చంద్రశేఖర్ తన తొలి చిత్రంలోనే మంచి పనితీరు చూపించాడు.
వంశీ పచ్చిపులుసు కెమెరా పనితనం, గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. “బుట్ట బొమ్మ” ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదల కానుంది.