కార్తికేయ-2 బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా సక్సెస్ తో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది అనుపమ పరమేశ్వరన్. ఇదే ఊపులో మరో సక్సెస్ కొట్టేయాలనుకుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా బట్టర్ ఫ్లై సినిమాను రిలీజ్ చేసింది. అయితే థియేటర్లలో కాదు, ఓటీటీలో.
నేరుగా ఓటీటీలోకి వచ్చిన బట్టర్ ఫ్లై సినిమా అనుపమ పరమేశ్వరన్ ఆశలపై నీళ్లుజల్లింది. ఈ ‘బట్టర్ ఫ్లై’ ఆశించిన స్థాయిలో ఎగరలేకపోయింది. థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా నెటిజన్లను ఏమంత పెద్దగా ఆకర్షించలేకపోయింది.
ఓ అపార్ట్ మెంట్ లో జరిగే కథతో తెరకెక్కింది బట్టర్ ఫ్లై సినిమా. ఇద్దరు పిల్లలు మిస్సవుతారు. వాళ్లను వెదికి పట్టుకోవడం, ఈ క్రమంలో ఎదురైన సవాళ్లను అధిగమించడమే ఈ సినిమా కథ. ఈ స్టోరీ మొత్తం అనుమప పరమేశ్వరన్ చుట్టూ తిరుగుతుంది. ఆమె కూడా శక్తివంచన లేకుండా ప్రయత్నించింది.
కానీ కథలో లోపాలు, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా లేకపోవడం లాంటి కారణాల వల్ల బట్టర్ ఫ్లై సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. భూమిక, రావురమేశ్, ప్రవీణ్ లాంటి ఆర్టిస్టుల ప్యాడింగ్ కూడా ఈ సినిమాకు కలిసిరాకపోవడం బాధాకరం.