అసలు అలా ఏలా మోసం చేసావురా..అని ఘరానా మోసగాళ్లందరూ ఆశ్చర్యపోయేలా చేసాడో మాయగాడు.. మోసగాడు కమ్ మాయగాడు. తన ఇంట్లో ప్రింట్ తీసుకున్న నకిలీ చెక్ తో ఏకంగా ఫోర్ష్యే కారే కొనడం అంటే , అంత పెద్ద కార్ల కంపెనిని మోసం చేయడం అంటే మాయ కాకపోతే మరేంటి.. అలా ఎలా చేయగలిగాడు??అసలు విషయం ఎలా బయటపడిందో తెలుసా??
ఫ్లోరిడాకు చెందిన విలియం కెల్లి అనే వ్యక్తి గత వారం డెస్టిన్ లోని ఫోర్షే కార్ల షోరూం కి వెళ్లాడు..ఏ మాత్రం డౌట్ రాకుండా కార్లన్నింటిని పరిశీలించి చివరకి ఫోర్షే 911 టర్బోను సెలక్ట్ చేసుకున్నాడు.. దాని విలువ 1,39,203 డాలర్లు..క్యాష్ స్థానం లో చెక్ ఇస్తానన్నాడు..కంపెనివాళ్లు యాక్సెప్ట్ చేసారు..చెక్ వారి చేతిలో పెట్టి కారు తీసుకుని ఎంచక్కా పోయాడు..ఆ కారుతో షికార్లు చేయడమే కాదు, రకరకాల చోట్లకి వెళ్లి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసాడు..వీడు మామూలోడు కాడు..
ఒకరోజు అదే కారులో మిరమర్ బీచ్ లో జ్యువెలరి షాప్ కి వెళ్లాడు.. మూడు రోలెక్స్ వాచిలను సెలక్ట్ చేసాడు.. మొత్తం మూడింటి ధర 61,521 డాలర్లు.. ఇంకేముంది మనోడు మళ్లీ చెక్ బుక్ తీసాడు..సంతకం చేసి వారి చేతిలో పెట్టాడు.. ఇక్కడ వచ్చింది అసలు చిక్కు.. చెక్ క్యాష్ గా డిపాజిట్ అయ్యేవరకు వాచ్ లు తన చేతికి ఇచ్చేది లేదని ఆ షాప్ వాళ్లు వాచ్ లను తమ దగ్గరే పెట్టుకున్నారు..
చెక్ చెల్లలేదు.. నకిలి చెక్ అని గుర్తించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు..అప్పటికే మోసపోయాం అని తెలుసుకున్న ఫోర్ష్యే కంపెని వారి కేసు కూడా పోలీసుల దగ్గర ఉంది..ఇంకేముంది రెండిటిని ఆధారంగా చేసుకుని మనోడి ఫోటోలను బట్టి వాడిని పట్టుకున్నారు.. ఆ చెక్లు ఎక్కడివి అని అడిగితే అతనిచ్చిన సమాధానానికి పోలిసులు అవాక్కయ్యారు.. తన ఇంట్లోని కంప్యూటర్లో తనే స్వయంగా తయారు చేసుకుని ప్రింట్ తీసుకున్నాడట.. వాహ్..ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతున్న కెల్లి ఫోటోలు చూసి అలా ఎలా మ్యానేజ్ చేసావురా..నిజంగా కోట్లు పెట్టి కార్ కొన్న వాడు కూడా ఇంత బిల్డప్ ఇవ్వడు అని కామెంట్ చేస్తున్నారు..!