వయసనేది శరీరానికి సంబంధించింది కానీ, మనసుకు సంబంధించింది కాదని నిరూపించాడు ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్. చంద్రునిపై అడుగుపెట్టిన రెండో వ్యోమగామిగా గుర్తింపు పొందిన ఆయన 9వ దశకంలో మళ్ళీ పెళ్ళికొడుకు అయ్యాడు. తన 93వ జన్మ దినోత్సవం రోజున తన పెళ్ళి శుభవార్త చెప్పాడు.
చాలాకాలంగా ప్రేమలో ఉన్న గర్ల్ ఫ్రెండ్ డాక్టర్ అన్‌కా ఫార్‌ను లాస్‌ఏంజెలిస్‌లో వివాహం చేసుకుని యావత్ ప్రపంచాన్ని వీడు మగాడ్రా బుజ్జి ! అనిపించాడు. ఈ మేరకు తన వెడ్డింగ్ న్యూస్ ని ట్వీట్ చేస్తూ తన మనసు టీనేజర్‌లా ఉరకలేస్తున్నదని వ్యాఖ్యానించారు