ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు. ఓటీఎస్ పథకం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో బీవీ రాఘవులు మాట్లాడుతూ…. దివాళా తీసిన ప్రభుత్వానికి డబ్బులు సమకూర్చుకోవడానికే ఓటీఎస్ పథకం తీసుకువచ్చారని రాఘవులు ఆరోపించారు. నిజంగా పేదలకు ఇళ్లపై హక్కు కల్పించాలని అనుకుంటే ఓటీఎస్ విధానం లేకుండా చేయాలని అన్నారు.
అంతేగానీ, ఓటీఎస్ పేరుతో పేదలపై భారం వేయడం ఏంటని ప్రశ్నించారు బీవీ రాఘవులు. ఓటీఎస్ అనేది పేదలకు వ్యతిరేకమైన చర్య అని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం తక్షణమే ఓటీఎస్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.