బెంగళూరులో దారుణ ఘటన వెలుగుచూసింది. క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ యువతి పోలీసుల్ని ఆశ్రయించింది. జార్ఖండ్ కు చెందిన బాధితురాలు బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. పార్టీ కోసం స్నేహితురాలి ఇంటికి వెళ్లి అయిపోయాక.. మురుగేష్ పాళ్యలోని తన ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది.
అయితే.. క్యాబ్ డ్రైవర్ యువతి ఇంటి సమీపంలోని ఖాళీ ప్రదేశంలో ఆపి అత్యాచారం చేశాడు. తర్వాత కారులో నుంచి బయటకు తోసేసి వెళ్లిపోయాడు. పోలీసుల్ని ఆశ్రయించిన బాధితురాలు జరిగిందంతా వివరించింది. నిందితుడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన దేవరాజ్ గా గుర్తించారు. అతడ్ని పట్టుకుని విచారణ జరుపుతున్నారు.
జీపీఎస్ ఆధారంగా క్యాబ్ ను దేవరాజ్ దాదాపు 20 నిమిషాల పాటు ఓ ఖాళీ ప్రదేశంలో నిలిపివేసినట్లు తెలిపారు పోలీసులు. క్యాబ్ ఎక్కిన వెంటనే యువతి నిద్రపోయిందని.. దీంతో డ్రైవర్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని వివరించారు.