మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది ప్రభుత్వం పరిస్థితి. అసలే ఆర్టీసీ సమ్మెతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వానికి కొత్త చిక్కులు రాబోతున్నాయి. రాష్ట్రంలో క్యాబ్ డ్రైవర్లు కూడా నిరవధిక సమ్మకు దిగబోతున్నారు.
ఓలా, ఉబర్ ఐటీ కంపెనీలకు సేవలు అందిస్తున్న 50 వేలుకుపైన క్యాబ్ డ్రైవర్ లు సమ్మెకు సిద్ధమయ్యారు. తమ డిమాండ్లు నెరవేర్చటంతోపాటు, టాక్సీ డ్రైవర్ల సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వినియోగదారులకు కేవైసీ తప్పనిసరి చేసే డ్రైవర్లపై దాడులను పరిష్కరించాలని కోరుతున్నారు తెలంగాణ టాక్సీ డ్రైవర్స్ జెఎసీ చైర్మన్ షేక్ సలాఉద్దీన్.