భూ పరిపాలనలో ప్రక్షాళన అంటూ తెలంగాణ ప్రభుత్వం ధరణి వెబ్ సైట్ ను తీసుకొచ్చింది. కానీ ధరణితో కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి. నిషేధిత భూముల జాబితాలోకి పట్టా భూములు పోయాయి. ఒక్క బై నెంబర్ పై లిటిగేషన్ ఉన్న మొత్తం సర్వే నెంబర్ ను బ్లాక్ చేస్తున్నారు. దీంతో ఇతరులు కూడా తమ భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లాయంటూ మండిపడుతున్నారు. స్వయంగా మంత్రులు సైతం ధరణిపై కోర్టుకెక్కారు కూడా.
దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ధరణి సమస్యలను పరిష్కరించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి హరీష్ రావు అధ్యక్షతన తలసాని, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ధరణి సమస్యలను చూపటంతో పాటు పరిష్కార మార్గాలను సూచించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.