వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. సులువుగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, తలసాని, మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్‌కుమార్ పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అంశాలు, సమస్యలపై చర్చించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సంస్థలతో మాట్లాడి తగు సూచనలు చేయాలంటూ సీఎం కేసీఆర్ ఈ మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సబ్ కమిటీ నాలుగైదు రోజుల్లో ప్రభుత్వానికి పలు సూచనలు చేయనుంది.
ఇప్పటికే పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ పలు కొత్త అంశాలను తెరపైకి తెచ్చారన్న వాదనలున్నాయి. దీంతో సబ్ కమిటీ సిఫార్సులు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.