హైదరాబాద్‌లోని సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఓ వ్యక్తిని పోలీసులు అడ్డుకున్నారు. పంజాగుట్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాధితుడు మంచిర్యాల జిల్లాకు చెందిన రవీందర్, అక్కడే కేబుల్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. తనకున్న రెండెకరాల భూమిని అమ్మి కేబుల్ నెటవర్క్ నడుపుతున్నాడు. ఇటీవల రవీందర్ కేబుల్ నెట్ వర్క్ ను ఓ రౌడీషీటర్ లాగేసుకున్నాడని..తనకు చెందిన కొంత భూమిని కూడా ఆ రౌడీషీటర్ ఆక్రమించుకున్నాడని రవీందర్ చెప్పాడు. ఈ విషయంపై పోలీసులకు, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆవేదన వ్యక్తం చేశాడు.
తెలంగాణ ఉద్యమంలో తాను చురుకుగా పాల్గొన్నానని… జిల్లాలో కేసీఆర్‌కు గుడి కట్టి పూజలు కూడా చేస్తున్నట్టు తెలిపాడు. కేసీఆర్‌పై అభిమానంతో తన చేతిపై ఆయన పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నానని చెప్పాడు.. ముఖ్యమంత్రి గారు తన సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు.