కరోనా వైరస్ తో పోరాడుతూ ప్రాణాలకు తెగించి వైద్యం చేసున్న వైద్యులు, వైద్య సిబ్బంది సేవలు చిరస్మరణీయం. జనం అంతా లాక్ డౌన్ సమయంలో పిల్లలు, కుటుంబంతో ఇంట్లో ఉంటే వైద్యులు, సిబ్బంది మాత్రం ఆసుపత్రుల్లో యుద్ధం చేస్తున్నారు. కానీ వారికి పిల్లలంటారు కదా…? ఆ తల్లులు కూడా తమ పిల్లలను దగ్గరకు తీసుకోవాలని ఉంటుంది కదా…? దూరం నుండి చూస్తూ ఎన్నాళ్లు భరిస్తారు…?
వీటికి పదేళ్ల ఓ చిన్నారి పరిష్కారం చూపింది. కరోనా వారియర్స్ ప్రేమకు హద్దులు చేరిపేస్తూ… హగ్ కర్టైన్ తయారు చేసింది. కరోనాతో పోరాటం చేస్తున్న తమ గ్రాండ్ పేరెంట్స్ ను కలుసుకునేందుకు హగ్ కర్టైన్ ను తయారు చేసి, ప్రశంసలు పొందుతుంది.
కరోనా పరీక్షలకు ఎలాగైతే… ఓ చాంబర్ నుండి శాంపుల్స్ కలెక్ట్ చేయడానికి గ్లౌజులతో చేతులు బయటకు పెడతారో అలాగే ఇదీ ఉంటుంది. కానీ దృడమైన రబ్బర్ తెర కావటంతో అవతలి వారు మనకు కనపడతారు. అలా తమ ప్రేమను పంచుకొని, హగ్ చేసుకొని కొంతైనా ఊరట చెందే అవకాశం కలుగుతోంది.