దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ సంప్రదాయాన్ని అవమానిస్తూ జరిగిన ఓ సంఘటన అందరికీ షాక్ ఇస్తోంది. సాధారణంగా భారతీయ సంప్రదాయం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది చీర కట్టు. భారతీయ మహిళలు చీరకట్టులో ఎంత అందంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడికి వెళ్లినా ఇక్కడి మహిళలు చీరలనే కట్టుకుంటారు. పైగా చాలామంది విదేశీయులు సైతం మన చీరకట్టుకు ఫిదా అవ్వడమే కాదు ఫాలో అవుతున్నారు కూడా.
అయితే ఆ సంప్రదాయాన్ని అవమానిస్తూ ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ చేసిన నిర్వాకం ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.వివరాల్లోకి వెళితే… అనితా చౌదరి అనే మహిళ “ఇప్పుడు చీర ఇండియన్ రెస్టారెంట్ లో స్మార్ట్ అవుట్ ఫిట్ కాదు. మరి స్మార్ట్ అవుట్ ఫిట్ డెఫినిషన్ ఏంటో దయచేసి చెప్పండి. అప్పుడు నేనే చీర కట్టుకోవడం మానేస్తాను” అంటూ తనకు జరిగిన అవమానాన్ని వెల్లడిస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో వీడియోని పోస్ట్ చేసింది. అందులో హోటల్ ఉద్యోగిని చీర స్మార్ట్ క్యాజువల్ గా లెక్కలోకి రాదంటూ, ఆమెను హోటల్ లోకి రానివ్వమంటూ సమాధానం చెప్పడం కనిపిస్తోంది.
Advertisements
ఆ హోటల్ స్మార్ట్ క్యాజువల్స్ కు మాత్రమే అనుమతి ఇస్తుందట. దీంతో నెటిజన్లు సదరు హోటల్ పై మండిపడుతున్నారు. నిజానికి హోటల్ పై ఇలాంటి వివాదాలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి వివక్షను హోటల్ వారు చూపడంతో ఈ రెస్టారెంట్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.