డయాబెటిస్ ఉన్నవారిలో బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉండాలంటే బ్యాలెన్స్‌డ్ డైట్‌ను పాటించాలని వైద్యులు సూచిస్తుంటారు. లేదంటే డయాబెటిస్ నియంత్రణ సాధ్యం కాదు. దీని వల్ల శరీరంలో అనేక అవయవాలపై ప్రభావం పడుతుంది. తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక డయాబెటిస్ ఉన్నవారు డైట్‌ను పాటించేటప్పుడు చక్కెర ఎక్కువ ఉన్న పదార్థాలను తినడం మానేస్తారు. చక్కెర, ఇతర తీపి పదార్థాలను తీసుకోరు. కానీ చక్కెరకు బదులుగా తేనెను వాడుకోవచ్చు కదా ? అని చెప్పి తేనెను ఉపయోగిస్తుంటారు. అయితే డయాబెటిస్ ఉన్నవారు చక్కెరకు బదులుగా తేనెను వాడవచ్చా ? ఇందుకు వైద్యులు ఏమని సమాధానం చెబుతున్నారు ? అంటే…
డయాబెటిస్ ఉన్నవారు చక్కెరకు బదులుగా తేనె, బెల్లం వంటి ఇతర తీపి పదార్థాలను వాడుకోవచ్చు కదా.. సమస్య ఏమీ ఉండదు. అని చెప్పి వాటిని వాడుతారు. కానీ నిజానికి అవి శరీరంలోకి ప్రవేశించాక గ్లూకోజ్ కింద మారుతాయి. అందువల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ యథావిధిగా పెరుగుతాయి. కనుక చక్కెర ఏ రూపంలో ఉన్నా తీసుకోకూడదు. అవి చక్కెర అయినా, ఇతర తీపి పదార్థాలు అయినా, తేనె, బెల్లం.. అయినా సరే తీసుకోరాదు.. అని డాక్టర్ వి.మోహన్ తెలిపారు.
అయితే డయాబెటిస్ ఉన్నవారు చక్కెర వాడాలని ఉంటే అందుకు బదులుగా ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ వాడుకోవచ్చు. అది కూడా పరిమిత మోతాదులో మాత్రమే వాడాలి. అలాగే అన్ని పోషకాలు ఉన్న పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. దీంతో చక్కెర తినాలన్న కోరిక నశిస్తుంది. దీంతోపాటు షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. సీజనల్ గా లభించే పండ్లను పరిమిత సంఖ్యలో తినాలి. చక్కెర తినాల్సి వచ్చినప్పుడు పూర్తిగా మానేయాలి. అయితే కొందరికి దాహం అవడం వల్ల దాన్ని చక్కెర తినాలి కాబోలునని భావిస్తారు. కానీ అందుకు బదులుగా కొద్దిగా నీటిని తాగితే చక్కెర తినాలన్ని కోరిక ఉండదు. ఇలా డయాబెటిస్‌ను కంట్రోల్ చేయవచ్చు. దీంతోపాటు ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, మెడిటేషన్ చేస్తే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.