డబ్బులు డ్రా చేయాలి అనుకుంటే ఏటీఎం కార్డు చాలా కీలకం. ఇప్పుడు యుపిఐ వంటివి వచ్చినా సరే ఎటిఎం కు ఉన్న ప్రాధాన్యత వేరు. బ్యాంకు లు కల్పించిన ఈ సౌకర్యం చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎటిఎం నుంచి నగదు డ్రా చేసే విషయంలో మోసాలు బాగా జరుగుతున్నాయి. దీనితో బ్యాంకు లు చిప్ కార్డుని కూడా ప్రవేశ పెట్టాయి.
ఇది ఇలా ఉంచితే చాలా మందిలో ఉన్న సందేహం… చనిపోయిన వారి బ్యాంక్ అకౌంట్ నుంచి వారి కుటుంబ సభ్యులు ఏటీఎం కార్డు వాడి డబ్బులు విత్‌డ్రా చేయవచ్చా అనే దానిపై చాలా మందికి స్పష్టత లేదు. కస్టమర్ల మరణం తరువాత ఏ సమయంలోనైనా సరే ఎటిఎం ద్వారా నగదు డ్రా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రికార్డ్ తేదీ మరియు ఉపసంహరణ సమయం అన్ని స్టేట్మెంట్ లో ప్రచురితమవుతుంది కాబట్టి.
మరణించిన తేదీని డెత్ సర్టిఫికేట్ లో కచ్చితంగా పేర్కొంటారు. చిన్న మొత్తంలో ఇది పెద్దగా పట్టించుకోవలసిన పని లేదు గాని… కానీ ఇదే ఎక్కువ డబ్బులు ఉన్న ఖాతాలో మీకు క్లైమ్ చేసే వారసులకు ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇన్సూరెన్స్ క్లైమ్ మాత్రం ఈ విషయంలో ఎవరికీ వచ్చే అవకాశం ఉండదు. డెత్ సర్టిఫికేట్ చూపించినప్పుడు… చనిపోయిన తర్వాత డబ్బులు డ్రా చేసారు అనేది స్టేట్మెంట్ లో కచ్చితంగా కనపడుతుంది.