ఈ రోజుల్లో స్కూటి వాడకం పెరిగింది. ఆఫీసులకు వెళ్ళడానికి, ఏవైనా వస్తువులు తెచ్చుకోవడానికి, ప్రయాణంలో రిస్క్ లేకుండా ఉండటానికి స్కూటి వాడకం ఎక్కువగా పెరిగింది. అయితే కొందరు స్కూటీల విషయంలో జాగ్రత్తగా ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా డిక్కీ ఉంది కదా అని అందులో ఏది పడితే అది పెడుతున్నారు. ప్రధానంగా సానిటైజర్, పెట్రోల్ వంటి ప్రమాదకరమైన పెట్టి తీసుకు వెళ్తున్నారు.
అసలు స్కూటీ డిక్కీలో పెట్రోల్ పెట్టడం మంచిదేనా…? పెట్రోల్ ని బాటిల్ లో నింపి స్కూటీ డిక్కీలో పెట్టడం కరెక్ట్ కాదు. పెట్రోల్ దహన ఉష్ణోగ్రత గరిష్టంగా 280⁰c ఉంటే కనిష్టంగా -25⁰c ఉంటుంది. పెట్రోల్ ఎప్పుడూ అవిరి రూపం లోకి మారుతూ వుంటుంది. అలా ఆవిరిగా మారినప్పుడు అది మండటానికి కేవలం -25⁰c చాలు. మామూలుగా మనం ఏదైనా వస్తువు స్కూటీ డిక్కీ లో పెట్టినప్పుడు అది వేడి ఎక్కుతుంది.
స్కూటీ డిక్కీ భాగం ఇంజిన్ కి దగ్గరలో ఉండటమే దానికి కారణం. ఒక వేళ పెట్రోల్ బాటిల్ డిక్కీలో ఉండి, ఆవిరి రూపంలో మారి బాటిల్ బయటకి లీక్ అయితే స్కూటీ కాలిపోతుంది. అయితే బాటిలో నిండా పెట్రోల్ నింపి పెడితే ప్రమాదం తక్కువ. పెట్రోల్ ఆవిరి రావడానికి చోటు లేదు కాబట్టి… ప్రమాదం జరగడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాని పెట్రోల్ ని డిక్కీ లో పెట్టడం అనేది మంచిది కాదు. అద్రుష్టం బాగుంటే ఒకే… కాని దరిద్రం వెంటాడితే నిండా ఉన్నా, మొత్తం ఉన్నా సరే ప్రమాదం జరుగుతుంది.