మన చుట్టూ ఉండే జంతువులు, వాటి వాటి ఆహార పద్దతులు ఆశ్చర్యంగా ఉంటాయి మనకు. ప్రమాదకరమైన జీవులు, సాదు జీవులు ఇలా అనేక రకాల జంతువుల ఆహార పద్దతులను కొందరు ఆసక్తికరంగా గమనిస్తూ ఉంటారు. వాటిల్లో కొండచిలువ ఆహారం తీసుకునే విధానం మనకు ఆసక్తికరంగా ఉంటుంది. అసలు అవి ఏ విధంగా జంతువులను మింగుతాయి అనే ప్రశ్న చాలా మందిలో ఉంది.
Also Read:అన్నింటికీ సర్దుకుపోవాలి… అంతే తప్పదు!!
సాధారణంగా ఇతర జీవులు ఆహారం అవసరం లేనప్పుడు తమ కంటికి కనపడితే తింటూ ఉంటాయి. కాని ఇది కొండచిలువ విషయంలో భిన్నంగా ఉంటుంది. కొండచిలువ కు ఆకలి కలిగినప్పుడు మాత్రమే తింటుంది. అది దాడి చేసి జీవి నాడి ఆగిపోయే వరకూ బిగించిపెట్టి తర్వాత గాలి పీల్చుకోలేక ప్రాణం పోయిన తర్వాత నోటిని సాగదీసుకుంటూ క్రమంగా మ్రింగుతుంది.
అయితే మింగిన తర్వాత ఒక్కోసారి అది ఆహారాన్ని కక్కేస్తుంది. ఇలా ఎందుకు చేస్తుందో చూస్తే… తాను మింగిన ఆహారం తన పొట్ట పరిధి కంటే ఎక్కువగా ఉందని భావిస్తే… లేదంటే మింగిన జంతువుకి… జంతువుకు పెద్ద పెద్ద ముళ్లు గానీ కొమ్ములు గానీ ఉంటే తనకు ప్రాణ ప్రమాదం ఉందని భావించే కక్కేస్తుంది. అయితే మింగిన తర్వాత అది… చెట్టుకి చుట్టుకుని ఉంటుంది. అప్పుడు ఎముకలు విరిగిపోతాయి. కాని కొమ్ములు లాంటివి ఉంటే గనుక దాన్ని చర్మాన్ని చీల్చుకుని బయటకు వస్తాయి. ఇక తాను మింగలేను అనుకునే ఏ జీవి జోలికి అది వెళ్ళదు. దాని జీర్ణ శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎముకలు, వెంట్రకలూ కూడా జీర్ణమవుతాయి.