మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో పాన్ కార్డ్ అనేది చాలా ముఖ్యమైంది అనే విషయం తెలిసిందే. అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రాలలో పాన్ కార్డ్ కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం.. ఇటీవల ప్రతీ ఒక్కరు తమ ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయడం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. భారీ లావాదేవీలు మరియు ఇతర ముఖ్యమైన పనులు చేయడానికి పాన్ కార్డు అనేది కీలకంగా మారింది.
అయితే ఇప్పుడు వచ్చిన కొన్ని రూల్స్ ఆధారంగా చూస్తే.. ఆధార్ కార్డు ఉంటే చాలు… వారి పాన్ కార్డును రూపాయి కూడా ఖర్చు లేకుండా తీసుకోవచ్చు. ఆధార్ ఆధారిత ప్రూఫ్ తో పాన్ కార్డులు తక్షణమే జారీ చేస్తారు.
ఆదాయపు పన్ను యొక్క కొత్త పోర్టల్‌కి వెళ్లి, ఇన్స్టెంట్ పాన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
న్యూ ఈ పాన్ అనే ఆప్షన్ వస్తుంది.
ఈ ఫీచర్ ద్వారా మీరు పీడీఎఫ్ ఫార్మాట్‌లో రియల్ టైమ్ ప్రాతిపదికన ఇ-పాన్ తీసుకోవచ్చు.
ఆ తర్వాత మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. అప్పుడు మిమ్మల్ని కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది.
అంతకు ముందు ఎప్పుడూ పాన్ తీసుకోకపోతే మాత్రం, గతంలో పాన్ ఇవ్వలేదు అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
ఆధార్ నెంబర్ ను మొబైల్ నెంబర్ తో లింక్ చేసినట్టు ఆప్షన్ క్లిక్ చేయండి.
మీ పూర్తి వివరాలు ఆధార్ లో అందుబాటులో ఉన్నాయనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
పాన్ నెంబర్ దరఖాస్తు తేదీ నాటికి నేను మైనర్ కాదు అని క్లిక్ చేయండి.
మీకు ఇప్పుడు ఒక ఒటీపీ వస్తుంది.
తర్వాత 15 అంకెలతో ఒక నెంబర్ వస్తుంది.
అప్పుడు మీకు కొత్త పాన్ కార్డు కాపీ మీ ఈ మెయిల్ కు వస్తుంది.