కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత అందరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. ఇంతకు ముందు ఆరోగ్య విషయంలో అలసత్వం ప్రదర్శించే ఎంతో మంది ఇప్పుడు మాత్రం ఏం తింటే ఆరోగ్యం బాగుంటుంది? కరోనా లాంటి భయంకరమైన వైరస్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి ? వంటి విషయాలపై దృష్టి పెడుతున్నారు. అయితే తాజాగా కొంతమంది వైద్యులు విటమిన్ డి కరోనా వ్యాప్తి నుంచి మనల్ని కాపాడగలిగే అనే విషయంపై పరిశోధనలు చేశారు.
నిపుణులు అధ్యయనం ప్రకారం కరోనా సోకకుండా విటమిన్ డి కాపాడుతుంది. కానీ శరీరంలో ఇది ఏమాత్రం తగ్గినా వ్యాధి తీవ్రత పెరగడమే కాకుండా చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని కనుగొన్నారు. ఐర్లాండ్ లోని ట్రినిటీ కాలేజీ, స్కాట్ ల్యాండ్ లోని ఎడిన్ బర్గ్ విశ్వ విద్యాలయం, చైనాలోని బె జియాన్ విశ్వ విద్యాలయం బృందాలు కలిసి మొట్ట మొదటిసారిగా జన్యుపరంగా విటమిన్ డి స్థాయిలను అతినీల లోహిత రేడియేషన్ ద్వారా అంచనా వేసి చూశారు. దీంతో విటమిన్ డి చర్మానికి చాలా కీలకమని తెలిసింది. దీని ప్రకారం విటమిన్ డి తీవ్రమైన కరోనా వ్యాధి నుంచి మాత్రమే కాక దాని వల్ల సంభవించే మరణం నుంచి కూడా రక్షిస్తుంది.
విటమిన్ డి లోపంతో వైరల్, బాక్టీరియా, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లకు ఎక్కువ అవకాశం ఉంది. బార్ ఇలన్ యూనివర్సిటీకి చెందిన అజ్రిలి ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ అండ్ నహరియాలోని గెలీలీ మెడికల్ సెంటర్ (GMC) పరిశోధకులు చేసిన అధ్యయనంలో విటమిన్ డి స్థాయిలు తక్కువ ఉన్న వారు కోవిడ్ వస్తే చనిపోయే అవకాశం కనీసం 20 శాతం ఉందని తేలింది.