వీరు కూడా రేపిస్టులే...! - Tolivelugu

వీరు కూడా రేపిస్టులే…!

can we call as rapists for who search disha name searched in adult sites, వీరు కూడా రేపిస్టులే…!

దేశం మొత్తం అత్యాచారం చేసిన ఆ మృగాళ్లను చంపేయాలని నినదిస్తున్న సందర్భంలో… ఉలిక్కిపాటుకు గురిచేసే అంశమిది. ఆ మృగాళ్లు మనతో పాటే తిరుగుతున్నాయని హెచ్చరిస్తున్న సందర్భం. అవును… డాక్టర్‌ను క్రూరంగా చంపిన తర్వాత నిందితులను శిక్షించాలని నినదిస్తున్న గొంతులు కొన్నైతే, ఆ అత్యాచారాన్ని ఆన్‌లైన్‌లో ఉంచారేమోనని ఆన్‌లైన్‌లో చూస్తున్న మృగాళ్లు కూడా ఉన్నారు. అవును…నమ్మేందుకు కాస్త కటువుగా ఉన్నా ఇదే నిజం.

దిశ పేరేంట్స్‌కు నిర్భయ తల్లి ఉత్తరం

ఇండియాలో ప్రతి 20నిమిషాలకో అత్యాచారం జరుగుతోంది, హత్యలు జరుగుతున్నాయని మేధావులంతా ఆరోపిస్తున్నారు. డేటా తీసి లెక్కలు చెబుతున్నారు. అయితే… ఇలా అత్యాచారం చేసేప్పుడు వీడియోలు తీయటం, నెట్‌లో పెట్టడం కూడా జరుగుతోందట. అందుకే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన డాక్టర్‌పై అత్యాచారం తర్వాత అశ్లీల వెబ్‌సైట్‌లో తన పేరుతో ఆ వీడియో ఉందేమో అని చూశారని తెలుస్తోంది. ఇప్పుడా పేరు పోర్న్‌ సైట్‌లలో ఎక్కువ మంది సెర్చ్‌ చేస్తున్నారట.

ప్రియాంక హత్యపై శ్రీరెడ్డి కంటతడి

దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు… మనుషుల రూపంలో మృగాళ్లు ఎందరున్నారో. కేవలం దొరికారు కాబట్టే ఆ నలుగురు దొంగలయ్యారు. కానీ దొరకకుండా ఉన్న కామాంధులు ఎందరో ఉన్నారు. దొరికన రేపిస్టులు ఎంత ప్రమాదకరమో… దొరకకుండా ఉన్న వీరు కూడా అంతే ప్రమాదకరం.

ప్రియాంక మృతిపై సెలబ్రిటీల ట్వీట్స్ ఇవే…

Share on facebook
Share on twitter
Share on whatsapp