ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే చాలు చాలా మంది అనేక రకాల ఆరోగ్యకరమైన ఆహారాన్ని దూరం పెడుతూ ఉంటారు. దానితో నష్టం లేకపోయినా సరే భయం కారణంగా మంచి ఆహారాన్ని దూరం చేసుకుంటారు. ముఖ్యంగా జామ కాయ, నారింజ, నిమ్మ వంటి వాటిని జలుబు జ్వరం ఉన్నప్పుడు తినాలి అంటే భయపడుతూ ఉంటారు. అసలు జలుబు చేసినప్పుడు వాటిని తినడం మంచిదేనా…?
Also Read:కాళీమాత పూజ ఎలా చేయాలో బీజేపీ చెప్పాల్సిన పనిలేదు!
ఈ మూడు పండ్లలో విటమిన్ సి చాలా ఎక్కువ కాబట్టి అది మన ఆరోగ్యానికి చాలా మంచిది. జలుబు చేసినప్పుడు బత్తాయి తినడం చాలా మంచిది. బత్తాయి రసంలో, నిమ్మ రసంలో చక్కర వేసుకోకుండా తాగితే చాలు. వాస్తవానికి జలుబు అనేది చక్కర వేసుకోవడంతోనే ఎక్కువగా వస్తుంది. దానికి తోడు నిమ్మ, బత్తాయి రసాలను ఎక్కువగా కూల్ వాటర్ తో తాగుతూ ఉంటారు. అందుకే అనారోగ్య సమస్యలు వస్తాయి.
నిమ్మ, బత్తాయి మేలు చేస్తే, చక్కెర కీడు ఎక్కువగా చేస్తుంది. ఇక జలుబు చేసినప్పుడు ఆ సమస్య ఒక్కటే కాకుండా పొట్టలో ఏదైనా సమస్య ఉంటే మాత్రం జామ పండు వద్దు. జామకాయలో కాల్షియం, పొటాషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ మరియు బి, ఫైబర్ మరియు విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి కాని… కొందరికి వాటితో ఎలర్జీ సమస్యలు వస్తాయి. కరోనా సమయంలో రోగ నిరోధక శక్తి పెరగడానికి సి విటమిన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. అలాంటిది జలుబు తగ్గడానికి కావాల్సిన రోగ నిరోధక శక్తి కోసం ప్రకృతిలో దొరికే పళ్ళు తింటే వచ్చే నష్టం ఏముంటుంది…?
Also Read:హిమగిరుల్లో మృత్యు విలాపం!