రాక్ స్టార్ యష్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం కేజిఎఫ్. 2018 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా కే జి ఎఫ్ చాప్టర్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.
ఏప్రిల్ 14న రిలీజ్ అయిన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఎక్కడ విన్నా కే జి ఎఫ్ చాప్టర్2 గురించి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇదే టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ పై విపరీతమైన చర్చ నడుస్తోంది. సినిమా చూసిన వాళ్ళుకు ఇది డబ్బింగ్ సినిమానా అనే సందేహం కలగక మానదు.
ALSO READ : కొండవీటి సింహం సినిమా నుంచి చిరును తీసేశారట!! ఎందుకో తెలుసా ?
మొదటి గా యష్ నటించిన రాఖీ భాయ్ పాత్ర గురించి మాట్లాడుకోవాలి. యష్ కి డబ్బింగ్ చెప్పింది వాసు అనే దుబ్బింగ్ ఆర్టిస్ట్.
అలాగే రాఖీ భాయ్ చిన్న వయసు నాటి పాత్రకు చరణ్ అనే చైల్డ్ ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పాడు.
రాఖీ బాయ్ తల్లి శాంతి పాత్ర కూడా ఈ సినిమాకు చాలా కీలకం. ఆమె పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను కమల నాయుడు చెప్పారు.
ఇక మరోపాత్ర అనంతనాగ్… ఈ పాత్రతోనే సినిమా స్టార్ట్ అవుతుంది. ఇక ఆ పాత్రకు కూడా మంచి గుర్తింపు ఉంటుంది. ఈ పాత్రకు శుభలేఖ సుధాకర్ డబ్బింగ్ చెప్పారు.
గరుడ… చాప్టర్ 1 లో విలన్ గా నటించిన గరుడ పాత్రకు బిగ్ బాస్ కి వాయిస్ చెప్పే రాధాకృష్ణ ను ఎంచుకున్నారు.
హీరోయిన్ శ్రీనిధి శెట్టి… పార్టు1 లో ఈమె పాత్రకు అంత ప్రాధాన్యం లేకపోయినా చాప్టర్ 2 లో మంచి ప్రాధాన్యం లభించింది. ఈ పాత్రకు జ్యోతి వర్మ డబ్బింగ్ చెప్పారు.
ఆఖరిగా రవీనాటాండన్ అలాగే మాళవిక అవినాష్ ఈ రెండు పాత్రలు కూడా సినిమాకి చాలా ముఖ్యం. ఈ రెండు పాత్రలకు కూడా క్రాంతి డబ్బింగ్ చెప్పారు.