దాదాపు 36 ఏండ్ల తర్వాత ఫిఫా ప్రపంచ కప్ కు కెనడా జట్టు అర్హత సాధించింది. టొరంటోలో జమైకా జట్టుపై 4-0 తేడాతో ఆదివారం విజయం సాధించి ఈ అర్హతను పొందింది.

దీంతో ఫిఫా ప్రపంచకప్ – 2022 కు అర్హత సాధించిన తొలి సీఓఎన్సీఏసీఏఫ్(కాన్ఫిడరేషన్ ఆఫ్ నార్త్, సెంట్రల్ అమెరికా, కరేబియనల్ అసోసియేషన్ ఫుటు బాల్) దేశంగా కెనడా రికార్డు సృష్టించింది. అంతకు ముందు 1985లో హోండరాస్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 1-0 తేడాతో విజయం సాధించింది.
దీంతో 1986 ప్రపంచకప్ కు అర్హత సాధించింది. మళ్లీ 37 తర్వాత ప్రపంచ కప్ కు అర్హత సాధించడంతో జట్టు విజయోత్సహంలో మునిగిపోయింది.
ఇక ఇప్పటికే పది యూరోపియన్ జట్లు ఫిఫా వరల్డ్ కప్ ఖతార్- 2022 లో తమ స్థానాలను పదిలపరుచుకున్నాయి. ప్రస్తుతం ప్లే ఆఫ్ మార్గంలో ఇంకా మూడు స్థానాలు ఉన్నాయి.