టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ఖమ్మం పర్యటన రద్దు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం అయన ఖమ్మంలో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటన మళ్లీ ఎప్పుడు ఉంటోందనే విషయంలో ఒకటి, రెండు రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నట్టు అధికారులు చెప్తున్నారు.
ఈ- కామర్స్ కు సంబంధించి ఏర్పాటు చేసిన పార్లమెంట్ కమిటీ సమావేశంతోపాటు.. తెలంగాణ ప్రభుత్వ స్పేస్ టెక్ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమాల నేపథ్యంలో కేటీఆర్ పర్యటన వాయిదా పడిందని వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. ఖమ్మంలో ప్రస్తుతం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యకర్త ఆత్మహత్యతో మంత్రి పువ్వాడకు నిరసన సెగలు ఎదురయ్యాయి.
అయితే.. కేటీఆర్ పర్యటన రద్దుకు అది కూడా కారణం కావచ్చు అంటున్నారు ప్రతిపక్షనాయకులు. ఉద్రిక్తతల మధ్య పర్యటించడం అంత మంచిది కాదని భావించిన కేటీఆర్ తన పర్యటనను రద్దు చేసుకోని ఉంటారనే విమర్శలు వినిపిస్తున్నాయి.